విజయవాడలో ఆదివారం జరిగే హైందవ శంఖారావ సభకు మద్దతు తెలిపేందుకు శనివారం రాత్రి చౌడేపల్లి, పుంగనూరు, సోమల, సదుం తదితర మండలాల నుంచి హిందూ సంఘాల నాయకులు వందలాది మంది తరలి వెళ్లారు. స్థానిక పురవీధుల్లో బాణా సంచాలు పేల్చి, డప్పు వాయిద్యాల నడుమ ర్యాలీ నిర్వహించారు. తమ తమ బస్సుల్లో విజయవాడకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదలారు.