చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని నక్కబండలో ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ సందర్భంగా వారు గురువారం మాట్లాడుతూ నక్కబండ ప్రాంతంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వారు అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని కల్లుపల్లె పాఠశాలకు కాలినడకన వెళ్లి వస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వసతులు సరిగా లేనప్పుడు పిల్లల్ని ఎలా చదివించాలని అధికారులను ప్రశ్నించారు.