పుంగనూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు తెలిపారు. శనివారం కళాశాలలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాలలో ఒక బోరు, వచ్చే అకాడమిక్ ఇయర్కు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని చెప్పారు. అలాగే క్రీడలకు సంబంధించి రూ. 1 లక్ష రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు.