పుంగనూరు మండల పరిధిలోని కనుమ గంగమ్మ ఆలయ సమీపంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు పెద్దపంజానికి చెందిన నరేష్ బాబు (30) సొంత పనులపై పట్టణానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వెంటనే స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుడి కుడి కాలికి తీవ్ర గాయం అయింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.