సూర్య జయంతి పర్వదినం సందర్భంగా పుంగనూరు లోని పురవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి విహరిస్తూ సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ఆలయం వద్ద మొదలైన వాహన సేవ హై స్కూల్ విధి, బ్రాహ్మణ వీధి, పోస్ట్ ఆఫీస్, నగిరి, తేరు వీధుల గుండా మంగళ వాయిద్యాలు నడుమ కొనసాగింది. వాహన సేవను భక్తులు దర్శించగా, మహిళలు మంగళ హారతులు పట్టారు. గోవింద నామ స్మరణలతో వీధులంతా మారు మ్రోగాయి.