పుంగనూరులో మంగళవారం దొంగలు రెండు ద్విచక్ర వాహనాలను దోచుకెళ్ళారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు లోకెళ్తే గోకుల్ సర్కిల్ వద్ద ఓ దుకాణంలో రెండు బైకులను ఎత్తుకెళ్లారు. షాపు షట్టర్ ధ్వంసం చేసి ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితుడు వాపోయాడు. షాపులో ఉన్న ద్విచక్ర వాహనాలపై చోరీకి పాల్పడిన వ్యక్తి పాదముద్రలు కనిపిస్తున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.