పుంగనూరు నియోజకవర్గం లోని మండలాలలో అనుకోకుండా కురుస్తున్న వర్షాలతో రైతులకు అపార నష్టం కలిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వరి పొలాల్లో వరి కోసి వడ్లను ఇంటికి తరలించిన అనంతరం గడ్డి ఆరడానికి అలానే పొలాల్లో వదిలిపెట్టారు. రాత్రిపూట కురుస్తున్న వర్షంతో పొలాల్లో ఉన్నటువంటి గడ్డి వర్షపునీటిలో తడిచిపోయిందని అది ఎందుకు పనికి రాకుండా పోతుందని బాధిత రైతులు శనివారం ఉదయం తెలియజేశారు.