నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగ గ్రామంలోని ఓ గుడి దగ్గర మంగళవారం ఓ పాము దూరింది. ఓం శక్తి మాల వేసుకున్నవారు పామును చూసి పరుగులు తీశారు. స్థానికులు ఈ విషయాన్ని స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ కు సమాచారం అందించారు. అనంతరం స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ ఆలయం వద్దకు వెళ్లి పామును పట్టి గోతం సంచిలో బంధించారు. అనంతరం పామును సురక్షితంగా తీసుకొని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.