చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరగాల్సిన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీవో అబ్దుల్ రహీం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి సభ్యులు హాజరు కావాల్సిన సంఖ్యలో రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. తిరిగి సమావేశం నిర్వహించే తేదీని మళ్లీ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.