సోమల మండలంలో మంగళవారం పలమనేరు ఆర్డిఓ భవాని పర్యటించారు. ఈ క్రమంలో ఆమె తహశీల్దార్ కార్యాలయంను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఆవులపల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులను పిలిపించి వారి రికార్డులను పరిశీలించారు. అలాగే రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడ భూములను పరిశీలించారు. తహశీల్దార్ బెన్నురాజ్, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఉన్నతధికారులకు తెలియజేస్తామని రైతులకు తెలిపారు.