క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల ప్రాథమిక వైద్యాధికారులు డాక్టర్ దినేష్ కుమార్ నాయక్, డాక్టర్ వినయ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక ఆరోగ్య కేంద్రం నుంచి ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి సరైన కారణాలు, గుర్తులు లేకుండా చివరి దశలో బయటపడుతుందని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చన్నారు..