భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయుల్లో ఒకరు, సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలను శుక్రవారం పుంగనూరులో ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణం లోని స్థానిక ఇందిరాకూడలిలో సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అద్దాల నాగరాజా, ఆయుబ్ ఖాన్, కృష్ణమూర్తి, గంగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.