హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం

63చూసినవారు
హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తుల వల్లంలో వైసిపి నేత ఉజ్వల్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక ఎంపీగా తన నియోజకవర్గ ప్రజలను కలవనీయకుండా హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చే రెండు నెలలు కాకుండానే దాడులు పెరిగిపోయాయని చెప్పారు.