పిచ్చాటూరు మండలం చెంచు రాజుల కండ్రిగ గ్రామంలో మంగళవారం సాయంత్రం రథసప్తమి పునస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామి అమ్మవారులతో ఊరేగింపు గావించారు. గ్రామస్తులు స్వామివారికి బ్రహ్మరథం పట్టారు. గురువులైన లోకేష్ దాస్ కోలాట బృందంతో నిత్య ప్రదర్శనలు గావించారు. గ్రామస్తులు స్వామివారికి మంగళ హారతులు చేపట్టారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాగయ్య, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు