పిచ్చాటూరు మండలం సిద్ధ రాజుల కండ్రిగ గ్రామంలోని శ్రీ సోమనాధేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ప్రదోషకాల పూజలు జరిగాయి. ప్రధాన అర్చకుడు నవీన్ శర్మ నందికి పాలాభిషేకం చేసి గరిక పుష్పాలను సమర్పించారు. ఆలయ ధర్మకర్త జ్యోతి రాజు తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో నందీశ్వరుని దర్శించుకున్నారు.