పిచ్చాటూర్ మండలం గోవర్ధనగిరి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలను అలంకరించారు. దూప దీప నైవేద్యం సమర్పించారు. గురువులైన లోకేష్ దాసు బృందముతో ఓంకార నామ స్మరణ చేశారు. గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఉభయ దాతలు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.