పుత్తూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఊరేగింపు ఆదివారం రాత్రి వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గురు రామచంద్రం శర్మ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి నైవేద్యం సమర్పించారు. ఇందులో భాగంగా మాడ వీధిలో ఊరేగింపు ప్రదక్షణ భావించారు. గురువులైన లోకేష్ దాస్ బృందంతో కోలాట భజనలు చేశారు. భక్తులు స్వామి వారికి బ్రహ్మరథం పట్టారు. దైవానికి భక్తులు మంగళ హారతులు అందజేశారు.