పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో వెలసి ఉన్న, అతి పురాతన ఆలయంలో శనివారం రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు కుమార్ శర్మ స్వామి స్వామివారికి మంగళహారతి పట్టారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ ఊరేగింపు నిర్వహించారు, గ్రామ భక్తులు దీప దూప నైవేద్యం సమర్పించారు. గురువు లోకేష్ దాస్ బృందముతో కోలాట భజనలు చేశారు. ఆలయ ధర్మకర్త విజయ్ కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు,