పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో ఉన్న, శ్రీ వీరాంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు, ఆలయ ప్రధాన అర్చకుడు కుమార్ స్వామిశర్మ, దైవానికి పంచామృతాలతో అభిషేకం చేసి సింధూరంతో అలంకరించారు. ప్రత్యేక పుష్పాలను సమర్పించి, నైవేద్యము కర్పూర హారతిని ఇచ్చారు. ఇందులో భాగంగా లోకేష్ దాస్ బృందముతో హనుమాన్ చాలీసా 21సార్లు చదివారు. ఆలయ ధర్మకర్త భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు,