వెంగళత్తూర్ గ్రామంలో వెలసి ఉన్న, బుధవారం సాయంత్రం సంధ్యా సమయములో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకము నిర్వహించారు చందనముతో చక్కగా అలంకరణ చేశారు. దీప ధూప నైవేద్యం సమర్పించారు. గురువులైన లోకేష్ దాస్ బృందంతో గణపతి మూల మంత్రాన్ని జపించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.