వెంగళత్తూర్: శివయ్యకి వైభవ పూజలు

79చూసినవారు
వెంగళత్తూర్: శివయ్యకి వైభవ పూజలు
పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో వెలసి ఉన్న, అతి పురాతన ఆలయంలో సోమవారం శివయ్యకి వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు కుమార్ శర్మ స్వామి, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పుష్పాలను అలంకరించారు. అనంతరం దీప దూప నైవేద్యం సమర్పించారు. ఇందులో భాగంగా గురువులైన లోకేష్ దాస్ బృందంతో శివనామ స్మరణ చేశారు. గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో శివయ్య అని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్