శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం జంగాలపల్లిలోని ఐజర్ రీసెర్చ్ కేంద్రంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రీసెర్చ్ భవనంలోని మూడో అంతస్తు కెమిస్ట్రీ ల్యాబ్లో విద్యార్థులు ప్రయోగాలు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధ్యాపకులు విద్యార్థులను వెంటనే బయటకు పంపించేశారు. ల్యాబ్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.