నేను రిటైర్ కావడం లేదు: రోహిత్ శర్మ
భారత క్రికెటర్ రోహిత్ శర్మ సిడ్నీలో నిర్వహించిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రిటైర్ కావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత టెస్టు మ్యాచ్ నుంచి విశ్రాంతి మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరో బయట కూర్చుని తన రిటైర్మెంట్ డిసైడ్ చేయలేరని అన్నారు. తన ఫామ్ దృష్ట్యా, జట్టు అవసరాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా రోహిత్ బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతుండటంతో పలువురి నుంచి విమర్శలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే.