తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో డ్రైనేజీ కాలువ దుస్థితి అధ్వానంగా ఉందని పలువురు పట్టణ వాసులు కమిషనర్ ఫజులుల్లాకు బుధవారం ఫిర్యాదు చేశారు. డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టి, డ్రైనేజ్ సమస్యలను తొలగించాలని కోరారు.