శ్రీహరికోట షార్ నుండి ఆదివారం ప్రయోగించిన పిఎస్ఎల్వి _సీ61 ప్రయోగం విఫలమైంది. రాకెట్ మొదటి రెండు దశలు విజయవంతంగా సాగినప్పటికీ మూడవ దశలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రాకెట్ గమన పట్టిక తప్పిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కే నారాయణ తెలిపారు. ప్రయోగం విఫలం కావడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఆయన తెలిపారు.