బాధ్యతాయుతంగా సేవలు అందించి పదవి వీరమణ పొందడం అభినందనీయమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. జూలై నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులను బుధవారం జిల్లా పోలీస్ అతిథిగృహంలో వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను అందజేసి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని కోరుకుంటునట్లు ఎస్పీ తెలిపారు.