పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్నక్యాంటీన్లను పునఃప్రారంభించామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరంలోని స్విమ్స్ కూడలి, ఎంఆర్ పల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన నాలుగు అన్న క్యాంటిన్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్. మౌర్యలు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదు రూపాయలకే పేదలకు అన్నం పెట్టడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు.