తిరుమలలో యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌

85చూసినవారు
తిరుమలలో యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌
తిరుమల భద్రత నేపథ్యంలో త్వరలోనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను అమలు చేసేందుకు టిటిడి భద్రతా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఈ సిస్టమ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని చాలాసార్లు టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మధ్య కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి లేఖ రాసింది. కేంద్రం గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడమే తరువాయి.. సాధ్యమైనంత త్వరగా యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.

సంబంధిత పోస్ట్