తిరుపతి జిల్లా అనుప్పల్లి విద్యానికేతన్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎస్సీకి చెందిన జేమ్స్ ను అదే కాలేజీలో చదువుతున్న అగ్రకులానికి చెందిన యశ్వంత్ అతని మిత్రులు రౌడీ షీటర్ రూపీ, మరో రౌడీ షీటర్ బ్లెడ్ కిరణ్, ఎలైట్ పార్క్ హోటల్ యజమాని పవన్ లు ఈనెల 13 తేదీన అవమానించి హత్యాయత్నం చేయడానికి బహుజన సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి సురేంద్రబాబు తీవ్రంగా ఖండించారు. జేమ్స్ పై దాడి చేసిన వారిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.