అయోధ్యకాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

75చూసినవారు
అయోధ్యకాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు
లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధవారం జరిగిన 12వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. అయోధ్యకాండలోని 45 నుండి 49వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 141 శ్లోకాలు, యోగ‌వాశిష్టం, ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 166 శ్లోకాల‌ను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు శ్లోక పారాయ‌ణం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్