సీఎం పర్యటన.. తిరుమలలో భారీ భద్రత

84చూసినవారు
సీఎం పర్యటన.. తిరుమలలో భారీ భద్రత
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం తిరుమల ఘాట్ రోడ్లలో ప్రత్యేక బలగాలను మోహరించారు. శ్రీపద్మావతి అతిథి గృహాల ప్రాంతంలోని సీఎం బస చేసే శ్రీగాయత్రి నిలయం అతిథి గృహంతో పాటు శ్రీవారి ఆలయం వరకు సీఎం పర్యటించే ప్రాంతాలలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్