తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దూర విద్యా విభాగం స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ భూపతి నాయుడు ఎస్ వి యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆయనకు సహచర అధ్యాపకులు, ఇతరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపతి నాయుడు మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు చెప్పారు.