కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనకు నిరసనగా తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో జూనియర్ డాక్టర్లు, వైద్యులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు మురళి మాట్లాడుతూ హత్య కేసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలు తావిస్తోందని చెప్పారు. స్వయంగా కోర్టులు జోక్యం చేసుకొని చేసిన ప్రకటన వీటికి బలం చేకూరుస్తోందని తెలిపారు.