ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 8వ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం రుయా ఆసుపత్రి నుండి ఎస్వీ మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన ర్యాలీని అధికారులతో కలిసి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.