నూతనంగా టీటీడీ డీఈఓగా నియమితులైన నాగరాజ నాయుడును ఆదివారం టీటీడీ జనరల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. అధ్యక్షుడు ముని వెంకటరెడ్డి డిఇఓని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. టీటీడీ విద్యాసంస్థలలో ప్రమోషన్లను త్వరగా చేపట్టాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన డిఇఓ త్వరలోనే ప్రమోషన్లు ఉంటాయని అన్నారు.