తిరుపతిలోని సాయిబాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూకట్టారు. కేటీ రోడ్డులోని ఖాదీ కాలనీ బాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు.