తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అధికారి జాగ్రత్తగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వ్యక్తికి జీ పాలెం సచివాలయం సిబ్బంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ను అందజేశారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుడు వద్దకు వెళ్లి పెన్షన్ అందించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.