సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయ భారతి సేవలు ఎనలేనివి అని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర కొనియాడారు. ఆదివారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయభారతి సేవలు ఎనలేవని తెలిపారు.