తిరుపతి జిల్లా వరదయ్యపాలెం ప్రాంతంలోని అటవీ భూముల్లో కల్కి ఆశ్రమ అధినేత కట్టిన కట్టడాలను వెంటనే ప్రభుత్వం కూల్చివేయాలని హేతువాదసంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ బిఎన్ కండ్రిగ దగ్గర అంజూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు 21ఎకరాలు ఆక్రమించు కొని పర్మినెంట్ కట్టడాలు కట్టారని ఆరోపించారు. దీనివల్ల కొందరు పేదరైతులు భూములు కోల్పోయారన్నారు.