తిరుమల బాలాజీనగర్ లో సచివాలయానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.
రూ. 50లక్షలతో తిరుమలలో సచివాలయం నిర్మిస్తున్నామని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాడిన తరువాత మొదటి శుభపరిణామమన్నారు. ఇప్పటికే తిరుమల వాసుల సమస్యలను టీటీడీ ఈఓ, అదనపు ఈఓల దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల స్థానిక టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.