శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు

85చూసినవారు
శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు
శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ వద్ద బెంగుళూరుకు చెందిన కర్ణాటక కోపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ బుధవారం తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈవో అధికారులతో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్