మఠం భూముల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు ఉత్తర్వులు

81చూసినవారు
మఠం భూముల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు ఉత్తర్వులు
తిరుపతి గ్రామీణ మండలం అవిలాల లెక్కదాఖలు వేదాంతపురం పంచాయతీలోని సర్వేనెంబరు 364, 368/1లోని హథీరాంజీ మఠం భూముల్లో శివానాయక్ అనే వ్యక్తి చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు మఠం ఇంఛార్జ్ పరిపాలనాధికారి కె. ఎస్. రామారావు బుధవారం ఉత్తర్వుల జారీ చేశారు. ఇందుకు సంబంధించి సర్వేయర్ లను ఏర్పాటు చేయాలని ల్యాండ్ ప్రొటక్షన్సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను కోరారు. కలెక్టర్, ఎస్పీలకు ఈ విషయాన్ని నివేదించారు.

సంబంధిత పోస్ట్