సమస్యల వలయంలో రుయా ఆసుపత్రి, మొద్దు నిద్రలో యాజమాన్యం.. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెబాట తప్పదని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. అనేక సందర్భాల్లో రుయా యాజమాన్యానికి వినతి పత్రాలు ఇచ్చినా చర్చలు జరిపిన సమస్య పరిష్కారం కానందున సమ్మె బాట పట్టే యోచనలో ఉన్నామన్నారు.