తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఓ ప్రైవేట్ హోటల్లో రహస్య సమావేశమయ్యారు. తిరుపతి కార్పొరేషన్ పై టీడీపీ, జనసేన పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మెజారిటీలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లను తమవైపుకు తిప్పుకొనేలా టీడీపీ, జనసేన పార్టీలు పోటీపడుతున్నాయి. ఆదివారం జరిగిన రహస్య సమావేశంలో డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు ముఖ్యమైన కార్పొరేటర్లు పాల్గొన్నారు.