విశాఖపట్నం జిల్లా పార్వతీపురంకు చెందిన గోపాలకృష్ణ తిరుమల అప్ ఘాట్ రోడ్డులో పోగొట్టుకున్న నగదు, బంగారు ఆభరణాల బ్యాగును బుధవారం నిజాయితీగా అందజేసిన జీపు డ్రైవర్ భూపతి నాయుడును జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఘనంగా సన్మానించి రివార్డు అందజేశారు. బ్యాగులో రూ. 1, 50లక్షల నగదు, రూ. 8, 40లక్షలు విలువ గల 140గ్రాముల బంగారు ఆభరణాలు, 201యూఎస్ డాలర్లు ఉన్నాయి. జీపు డ్రైవర్ ను జిల్లా ఎస్పీతో పాటు బాధితుడు అభినందించారు.