స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను జాగ్రత్తగా తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర అన్నారు. గురువారం కలెక్టరేట్ లో స్వర్ణ ఆంధ్ర @ 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్చువల్ విధానంలో సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.