విభజన హామీల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి రాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికామని చెప్పారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ఇబ్బందులు లేకుండా గతంలో మాదిరిగా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించాలని కోరారు.