శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం.. టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. తిరుమలలో ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, ఈ ల్యాబ్ లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగించబడతాయని గుర్తు చేశారు.