తిరుపతి: రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐపై కేసు

75చూసినవారు
తిరుపతి: రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐపై కేసు
రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌ పై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. గత మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తూ తన కాపురంలో గొడవలు పెడుతున్న విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఉద్యోగి భార్య ఫిర్యాదు చేసింది. విశ్వనాథ్‌ చెప్పినట్లుగా వినకపోతే తన భర్తను చంపేస్తానని ఫోన్‌లో బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొంది. జనవరిలో స్నేహితులతో కలసి తన భర్తపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది.

సంబంధిత పోస్ట్