తిరుపతి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ గురువారం తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతికి చాలా దూరం నుంచి భక్తులు వచ్చారని, సమయానికి సరైన ఆహారం తీసుకోక, టోకెన్ల కోసం వెంటనే క్యూ లైన్లలో చేరారన్నానరు. ఫుడ్ లేకపోతే రక్తంలో చక్కెర తక్కువగా ఉంటుందని, దాని వల్ల భక్తులు కుప్పకూలిపోయారన్నారు. కేవలం తొక్కిసలాట కారణంగానే భక్తులు చనిపోలేదన్నారు.